అక్టోబర్ 04th 2024 కరెంట్ అఫైర్స్:
1.పేరు దేశం (లిమా) లో జరుగుతున్న ISSF జూనియర్ ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్ లో భారత క్రీడా కారిని – ఖుషి కి ( 50 మీటర్స్) లో కాంస్యం పతాకం గెలుచుకుంది.
2.Women’s T20 World Cup -2024: UAE లో జరుగుతుంది .
3. మెడిగడ్డ బ్యారేజ్ పైన విచారణకు వేసిన కమిటీ – జస్టిస్ పి.సి. ఘోష్ కమిటీ
దీని అసలు పేరు – లక్ష్మి బ్యారజ్ . ఇది మెడిగడ్డ –మహాదేవపూర్ మండలం –జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో వుంది
4.పోక్సొ చట్టం – 2012 లో తెచ్చారు
POCSO- Protection of Children from Sexual Offences
5.హిందూ మహా సముద్రం లోని చాగోస్ దీవుల పై పూర్తి సార్వబౌమధికారాలను మరిషస్ కు బ్రిటన్ అప్పగించింది.
6.2022 కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం మిథున్ చక్రవర్తికి వచ్చింది.
ఈ పురస్కారాన్ని 1969 నుంచి ఇస్తున్నారు.
ఈ పురస్కారానికి నగదు రూ.15 లక్షలు ఇస్తారు (నగదు రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలకు నీర్జా శేఖర్ కమిటీ సిఫార్సు మేరకు పెంచారు.)
2021కు ఈ అవార్డు వహీదా రెహమాను వచ్చింది.
ఇప్పటి వరకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం 54 మందికి వచ్చింది.
2024 కు మిథున్ చక్రవర్తికి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది.
7.మేక్ ఇన్ ఇండియా పథకం – సెప్టెంబర్ 25, 2024 కి 10 years పూర్తి చేసుకుంది .
ప్రారంభం – సెప్టెంబర్ 25, 2014.
8.45వ చెస్ ఒలింపియాడ్ హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగింది.
పెంటేల హరికృష్ణ, డి.గుకేష్, అర్జున్ ఇరిగేషి, ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతితో కూడిన భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది.
ద్రోణవల్లి హారిక, వైశాలి రమేష్‌బాబు, దివ్య దేశ్ ముఖ్, వంతికా అగర్వాల్, తానియా సన్దేవ్లతో కూడిన భారత మహిళల జట్టు స్వర్ణం సాధించింది.
డి.గుకేష్, అర్జున్ ఇరిగేషి, దివ్య దేశముఖ్, వంతికా అగర్వాల్ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణాలు గెలిచారు.