సదస్సులు- సమావేశాలు:
క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం- అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో:
భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన చతుర్భుజ కూటమి (క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ – QUAD) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జనవరి 21న అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో జరిగింది. ఈ సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. భారత్ తరపున విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి భద్రతలు, స్వేచ్ఛాయుత. సహకారం వంటి అంశాలపై నాలుగు దేశాల మంత్రులు చర్చలు జరిపారు.
కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సు-2025:
కృత్రిమ మేధ కార్యాచరణ సదస్సు (ఏఐ యాక్షన్ సమ్మిట్-2025) ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ జరిగింది.
ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోడీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి తాను సహాధ్యక్షత వహించారు.
సదస్సుతీర్మానం ముఖ్యాంశాలు :-
డిజిటల్ అంతరాలను వీలైనంతగా తగ్గించడమే లక్ష్యం. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మరింతగా కృషి
ఏఐ టెక్నాలజీ పారదర్శకంగా, నైతిక సూత్రాలకు అనుగుణంగా, సురక్షితంగా, విశ్వసనీ యంగా, అదే సమయంలో ఎలాంటి వివక్షకూ తావు లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చూడటం.
ఏఐని ప్రజలకు, మొత్తంగా ప్రపంచానికి విశ్వసనీయ సుస్థిరాభివృద్ధి చోదక శక్తిగా తీర్చిదిద్దడం.
మానవ హక్కులను, లింగ సమానత్వాన్ని, భాషాపరమైన వైవిధ్యాన్ని, మేధో సంపత్తి హక్కులను అన్ని విధాలా పరిరక్షించడం.
12వ ప్రపంచ ప్రభుత్వాల సదస్సు:
12వ ప్రపంచ ప్రభుత్వాల సదస్సు ఫిబ్రవరి 11 నుంచి 13వ తేదీ వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని దుబాయ్ జరిగింది.గ్లోబల్ గవర్నెన్స్ కు సంబంధించిన సమస్యలను చర్చించడం కోసం వివిధ దేశాల ప్రభుత్వాలు, వ్యాపార కార్యనిర్వాహకులు, ఆలోచనాపరులను ఒక చోట చేర్చడమే ఈ సదస్సు ఉద్దేశం.
2025 సదస్సు థీమ్- “Shaping future Governments”
అపెక్ (APEC) శిఖరాగ్ర సదస్సు శిఖరాగ్ర సదస్సు 2024: పెరూ రాజధాని లిమా:
ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార కూటమి (అపెక్) శిఖరాగ్ర సదస్సు నవంబర్ 15 నుంచి 16 వరకు పెరూ రాజధాని లిమాలో జరిగింది. ఆర్థిక సహకారాన్ని, సామాజిక శ్రేయస్సు, పర్యావరణ పరిరక్షణ, భద్రతను బలోపేతం చేయడం, పౌరులకు సాధికారత కల్పించడం, వాతావరణ మార్పులు, ఆరోగ్యం, ఆహార భద్రత వంటి సవాళ్లను పరిష్కరించడం వంటి వాటిపై చర్చించారు.
APEC గురించి :
ఆసియా-పసిఫిక్ తీరప్రాంతంలోని దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యం పెంపొందడానికి 1989, నవంబర్ 7న అపెక్ ఏర్పడింది. దీనిలో మొత్తం సభ్యదేశాలు 21. ప్రధాన కార్యాలయం సింగపూర్‌లో ఉంది. భారత్ 1991లో APECలో చేరాలనుకుంది. అపెక్ కూటమిలోకి కొత్త సభ్యులుగా చేరేందుకు సభ్య దేశాలు అంగీకరించకపోవడంతో భారత్ ఇప్పటివరకు సభ్యత్వం లేదు కాని పరిశిలనలో వుంది .
59వ డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని మోదీ : భువనేశ్వర్ (అస్సాం ):
59వ డీజీపీలు, ఐజీపీల సదస్సు భువనేశ్వర్ లోని లోక్ సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలు, ఏఐ సాంకేతికతలతో జరుగుతున్న అక్రమాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. వీటితోపాటు డీప్ ఫేక్ వంటి వాటివల్ల సామాజిక, కుటుంబ సంబంధాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. కానిస్టేబుళ్ల స్థాయిలో టెక్నాలజీని వినియోగించి వారిపై పని భారాన్ని తగ్గించాలని సూచించారు. ఈ సదస్సులో దేశ భద్రతా వ్యవ హారాలకు సంబంధించి మేధోమధనం జరిగింది. ఉగ్రవాదం, మావోయిస్టుల నియం త్రణ, సైబర్ నేరాల కట్టడి, మహిళలపై జరుగుతున్న హత్యాచారాల నియంత్రణ, జలమార్గంలో సమర్థ బందోబస్తుకు సంబంధించి తీర్మానాలు జరిగాయి.
సైబర్ నేరాలపై యుద్ధాన్ని ఓ అవకాశంగా తీసుకుని పోలీసు అధికారులు పని చేయాలని ప్రధాని సూచించారు. స్మార్ట్ పోలీసింగ్ అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ సదస్సులో 250 మంది అధికారులు ప్రత్య క్షంగా పాల్గొన్నారు. మరో 750 మంది వర్చువ ల్గా హాజరయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజీత్ డోవల్ పాల్గొన్నారు.
ఐరాస 79 వ వార్షిక సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ -UNGA) సమావేశాలు 2024 :
ఐరాస 79 వ వార్షిక సర్వప్రతినిధి సభ (యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ -UNGA) సమావేశాలు 2024 సెప్టెంబర్ 10 నుండి సెప్టెంబర్ 30 వరకు అమెరికా లోని న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం లో జరిగాయి .
థీమ్ 2024: ” Leaving no one behind: acting together for the advancement of peace, sustainable development human dignity for present and future generation”
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి (సెక్రెటరి జనరల్ )- ఆంటోనియో గుటెరస్
COP -2024 సదస్సు :
నవంబర్ 11 నుండి 22 వరకు అజర్‌బైజాన్‌లోని బాకు నగరం
2024 సంవత్సరంలో జరుగుతున్న COP సదస్సు, అధికారికంగా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC) కు సంబంధించిన 29వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ (COP29) అని పిలుస్తారు.
ఈ సదస్సు నవంబర్ 11 నుండి 22 వరకు అజర్‌బైజాన్‌లోని బాకు నగరంలో జరుగుతుంది.
COP29 సదస్సులో ప్రధాన అంశాలు:
- ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరెన్సీ ఫ్రేమ్‌వర్క్ (ETF): దేశాల క్లైమేట్ చర్యల పారదర్శకత మరియు బాధ్యతను మెరుగుపరచడం ఈ ఫ్రేమ్‌వర్క్ లక్ష్యం.
- గ్లోబల్ స్టాక్‌టేక్: పారిస్ ఒప్పందం లక్ష్యాలను సాధించడంలో సాధించిన ప్రగతిని మూల్యాంకనం చేయడానికి మరియు అధిక లక్ష్యాల కోసం అవకాశాలను గుర్తించడానికి ఈ ప్రక్రియ జరుగుతుంది.
- క్లైమేట్ ఫైనాన్స్: అభివృద్ధి చెందుతున్న దేశాలు క్లైమేట్ మార్పులకు అనుగుణంగా మారడానికి మరియు వాటి ప్రభావాలను తగ్గించడానికి నిధులను సమీకరించడం ఈ అంశంపై చర్చ జరుగుతుంది.
- నష్టం మరియు నష్ట నిది : క్లైమేట్ మార్పు ప్రభావాలతో సంబంధం ఉన్న నష్టం మరియు నష్టాన్ని ఎదుర్కోవడానికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం గురించి చర్చ జరుగుతుంది.
- జస్ట్ ట్రాన్సిషన్: శిలాజ ఇంధనాల నుండి దూరమవడం వల్ల ప్రభావితమైన కార్మికులు మరియు సమాజాలను రక్షించడం దీని లక్ష్యం.
COP28 సదస్సు గురించి తెలుసుకోండి:
COP28 అనేది 2023 నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగిన యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్. ఇది UNFCCC (యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్) కి సంబంధించిన 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్.
COP28 సదస్సు ప్రాముఖ్యత:
- గ్లోబల్ స్టాక్‌టేక్: పారిస్ ఒప్పందం కింద క్లైమేట్ మార్పును పరిష్కరించడానికి ప్రపంచ ప్రయత్నాల మొదటి “గ్లోబల్ స్టాక్‌టేక్” పూర్తయింది.
- 5 డిగ్రీల సెల్సియస్ లక్ష్యం: శతాబ్దం చివరి నాటికి ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడం లక్ష్యం.
- నేషనల్ డిటర్మైండ్ కాంట్రిబ్యూషన్స్ (NDCs): 2025 నాటికి సవరించిన మరియు మరింత ఆశాజనకమైన జాతీయ క్లైమేట్ ప్లాన్లకు దేశాల సన్నాహాలను సూచించడం.
- గ్రీన్ ట్రాన్సిషన్: ఇప్పటికే జరుగుతున్న గ్రీన్ ట్రాన్సిషన్ను వేగవంతం చేయడం మరియు చివరికి పారిస్ ఒప్పందం లక్ష్యాలను సాధించడం.
COP28 సదస్సులో చర్చించబడిన అంశాలు:
- క్లైమేట్ ఫైనాన్స్
- క్లైమేట్ అడాప్టేషన్
- మిటిగేషన్
- టెక్నాలజీ ట్రాన్స్ఫర్
- లాస్ అండ్ డామేజ్
COP28 సదస్సు క్లైమేట్ మార్పును ఎదుర్కోవడానికి మరియు సుస్థిర భవిష్యత్తు కోసం పని చేయడానికి ప్రపంచ నేతలు, విధాన నిర్ణయకర్తలు మరియు క్లైమేట్ నిపుణులకు కీలక వేదికగా నిలిచింది.
COP సమ్మిట్ చరిత్ర:
మొదటి COP శిఖరాగ్ర సమావేశం 1995లో జర్మనీలోని బెర్లిన్‌లో జరిగింది. అప్పటి నుండి, ఇది ఏటా నిర్వహించబడుతుంది,
COP శిఖరాగ్ర సమావేశం COP27, ఇది 2022లో ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్‌లో జరిగింది.
నిర్మాణం మరియు భాగస్వామ్యం:
UNFCCCని ఆమోదించిన 197 దేశాల నుండి ప్రతినిధులు COP సమ్మిట్‌కు హాజరవుతారు. ఇందులో జాతీయ నాయకులు, వాతావరణ నిపుణులు, కార్యకర్తలు మరియు వ్యాపారాలు మరియు NGOల ప్రతినిధులు ఉన్నారు. పాల్గొనేవారు ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలు, క్లైమేట్ ఫైనాన్స్ మరియు అనుసరణ వ్యూహాలతో సహా గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ గురించి చర్చించి, చర్చలు జరుపుతారు.
COP సమ్మిట్ యొక్క ప్రాముఖ్యత:
COP సమ్మిట్ అనేది ప్రపంచ వాతావరణ మార్పులను పరిష్కరించడానికి ప్రాథమిక అంతర్జాతీయ వేదిక. COP శిఖరాగ్ర సమావేశాలలో తీసుకున్న ముఖ్య ఫలితాలు మరియు నిర్ణయాలు:
క్యోటో ప్రోటోకాల్ (1997) మరియు పారిస్ ఒప్పందం (2015), ఇది గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి లక్ష్యాలను నిర్దేశించింది
వాతావరణ మార్పులకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేయడానికి గ్రీన్ క్లైమేట్ ఫండ్‌ను ఏర్పాటు చేయడం
పారిస్ ఒప్పందాన్ని అమలు చేయడానికి నియమాలు మరియు మార్గదర్శకాలపై అంగీకరిస్తున్నారు
జాతీయ వాతావరణ కార్యాచరణ ప్రణాళికలపై పురోగతిని సమీక్షించడం మరియు కొత్త లక్ష్యాలను నిర్దేశించడం
COP శిఖరాగ్ర సమావేశాలు గ్లోబల్ క్లైమేట్ పాలసీని నడపడానికి మరియు వాతావరణ మార్పులను పరిష్కరించడానికి తమ కట్టుబాట్లకు దేశాలను జవాబుదారీగా ఉంచడానికి కీలకమైనవి.
32 వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్దిక వేత్తల సదస్సు –న్యూ డిల్లీ
32 వ అంతర్జాతీయ వ్యవసాయ ఆర్దిక వేత్తల సదస్సు(ICAE-International Association of Agriculture Economics) ఆగస్టు 02 , 2024 న న్యూ డిల్లీ లో జరిగినది
థీమ్ :” సుస్థిర వ్యవసాయం –ఆహార వ్యవస్తల దిశగా పరిణామం “
QUAD విదేశీ వ్యవహారాల శాఖల మంత్రుల సమావేశం –టోక్యో , జపాన్
QUAD విదేశీ వ్యవహారాల శాఖల మంత్రుల సమావేశం జపాన్ రాజధాని టోక్యో లో జులై 29, 2024 న జరిగినది .
QUAD లోని దేశాలు – భారత్,జపాన్,అమెరికా ,ఆస్ట్రేలియా .
ఇండో పసిఫిక్ తీర ప్రాంత చైతన్య ప్రాజెక్ట్ (IPMD ) ప్రారంభించాలని QUAD దేశాలు నిర్ణయించాయి .
IPMD వ్యూహాత్మక జలాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.
నీతి ఆయోగ్ పాలక మండలి(నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ) సమావేశం – న్యూ డిల్లీ
నీతి ఆయోగ్ పాలక మండలి(నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ ) 9 వ సమావేశం న్యూ డిల్లీ లో జులై 27, 2024 న జరిగినది
“వికసిత భారత్ -2047 “ లక్ష్య సాదన గూర్చి చర్చించారు .
నీతి ఆయోగ్ సిఈఓ –సుబ్రమణ్యం
50 వ G-7 శిఖరాగ్ర సదస్సు – 2024
G -7 దేశాలు : అమెరికా ,బ్రిటన్ , జర్మనీ , జపాన్ ,ఫ్రాన్స్. కెనడా, ఇటలీ .
అతీద్య దేశం : అపులియా , ఇటలీ .
ఇటలీ ప్రధాన మంత్రి – జార్జియా మేలోని అద్యక్షతన మీటింగ్ జరిగింది
సదస్సు లో పాల్గొన్న G -7 దేశాల ప్రముకులు : అమెరికా అద్యక్షుడు – జో బైడెన్, కెనడా ప్రధాని – జస్టిన్ ట్రోడో ,ఫ్రాన్స్ అధ్యక్షుడు – ఇమ్మనుయాల్ మేక్రన్ , జెర్మనీ చాన్సులేర్-ఒలేఫ్ షోల్జ్, బ్రిటన్ ప్రధాని – రిషి సునాక్ ,జపాన్ ప్రధాని –పుమియో కిషిద.
జరిగిన తేదీలు :జూన్ 13 నుండి 15 – 2024 వరకు .
ముఖ్యమైన అంశాలు: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ‘మిషన్ లైఫ్ ‘(పర్యావరణ పరిరక్షణ గురించి) ప్రస్తావించారు.
“ఐమేక్” –భారత్-పశ్చిమాసియ –ఐరొప దేశాల ఆర్దిక నడవ – మౌలిక సదుపాయాల వృద్ది కి .
BRI – బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (చైనా చేపట్టిన ప్రాజెక్ట్ కి అడ్డుకట్ట వేయాలని ప్రస్తావించారు .
ఏక్షామ్ పాయింట్స్:
తరువాత 51 వ జి-7 సమ్మిట్ జరుగు ప్రదేశం : 2025- కెనడా (అల్బెర్టా ).
2023 లో 49 వ సమ్మిట్ – హిరోషిమా , జపాన్ .
ప్రారంబంలో G-6 గా -1973 లో ఏర్పాటు .
ఫస్ట్ సమ్మిట్ G6 -1975 లో జరిగింది .
1976 లో కెనడా దేశం చేరింది – G7 గా ఏర్పాటు .
1997 లో రష్యా దేశం చేరింది – G 8 గా ఏర్పాటు .
2014 లో రష్యా దేశం కూటమి నుండి తప్పుకుంది . G8 కాస్త G7 గా మారింది.
You may also read about:
టెన్నిస్ గ్రాండ్ స్లామ్ లు – 2024 – విజేతలు మరియు రన్నర్స్ :