రాష్ట్రాల సమాచారం

చిల్లపల్లి  గ్రామా పంచాయితి కి  జాతీయ పంచాయతీ పురస్కారం :

పెద్దపల్లి జిల్లా మంథని మండలం చిల్లపల్లి గ్రామపంచాయతీ జాతీయ పంచాయతీ పురస్కారం-2024ను అందుకొంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో  రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి శాఖ రాజీవ్ రంజన్ సింగ్ సమక్షంలో ఆ జిల్లాకలెక్టర్ కోయ శ్రీహర్ష, చిల్లపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి రామకృష్ణకు దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ గ్రామం మహిళా మిత్ర కేటగిరీలో రెండో స్థానాన్ని కైవసం చేసుకొంది. గ్రామసభల్లో స్థానిక మహిళలు చురుగ్గా పాల్గొంటూ మహిళా పథకాలను విజయవంతంగా అమలుచేసినందుకు గాను చిల్లపల్లికి ఈ జాతీయ అవార్డు లభించింది.