- ఐరోపా కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాన్ డేర్ లేయేన్ ఎన్నిక:
- ఐరోపా సమాజ (ఈయూ) కార్యనిర్వాహక కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాన్ డేర్ లేయేన్ ఎన్నికయ్యారు.
- ఈ యు – రాజధాని – బ్రస్సెల్స్ ,బెల్జియం
- స్థాపన : 16 జనవరి 1958
SBI నూతన చైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారు నియామకం :
SBI నూతన చైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారు ఆగష్టు 28 నుండి కొనసాగుతారు .
ప్రస్తుతం: దినేష్ కుమార్ ఖార్ గారు వున్నారు
SBI ప్రస్తానo :1921 న బ్యాంకు అఫ్ కలకత ,బ్యాంకు అఫ్ బాంబే , బ్యాంకు అఫ్ మంద్రాస్ అను ఈ మూడు బ్యాంకు లను కలిపి ఇంపీరియల్ బ్యాంకు గా ఏర్పాటు చేసారు.
1955 న జూలై 1 స్ట్ న ఇంపీరియల్ బ్యాంకు ను SBI గా పేరు మార్పు.
* శ్రీలంక నూతన 9వ అధ్యక్షుడు దిసనాయకే అధ్యక్షుడిగా ప్రమాణం
ఆర్థికంగా కుదేలైన దేశ పునరుజ్జీ వానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే (56) ప్రకటించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జయంత జయ సూరియా సోమవారం మార్క్సిస్ట్ నేత దిసనా చేయించారు. అధ్యక్ష సచివాలయం ఇందుకు వేదికైంది.
ఎయిర్ స్టాఫ్ తదుపరి చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ 21 సెప్టెంబర్ 2024న నియమితులయ్యారు.
ప్రస్తుతం భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వైస్ చీఫ్‌గా ఉన్నారు.అమర్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 30న అత్యున్నత పదవిని చేపట్టనున్నారు,ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్. చౌదరి పదవీ విరమణ పొందారు.
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు అతిషి గారు :
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు అతిషి 21 సెప్టెంబర్ 2024న ప్రమాణ స్వీకారం చేశారు.ఆమె ఐదుగురు మంత్రులతో పాటు రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
పది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం:
ఇందులో ఏడుగురిని కొత్తగా నియమించగా, ముగ్గురిని ఒకచోట నుంచి మరోచోటకు బదిలీ చేసింది.
* తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు.
* మహారాష్ట్ర గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ను ఈ స్థానంలో ఉన్న రమేష్ బైస్ ను తప్పించింది.
* రాజస్థాన్ గవర్నర్ గా హరిభావ్ కిషన్ రావ్ బాగ్దేని నియమించింది. ఈ స్థానంలో ఉన్న సీనియర్ నేత కల్రాజ్ మిశ్రాను తప్పించింది.
* సిక్కిం గవర్నర్ గా ఓం ప్రకాశ్ మాధుర్ ని నియమించింది. ఈ స్థానంలో ఉన్న లక్షణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్ బదిలీ చేసింది.
* అస్సాం గవర్నర్ గా లక్షణ్ ప్రసాద్ ఆచార్యను నియమించింది .ఇతనికి మణిపూర్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మణిపుర్ గవర్నర్గా ఉన్న అనసూయ ఉయికేను తప్పించింది.
* జార్ఖండ్ గవర్నర్ గా సంతోష్ కుమార్ గంగ్వార్ ను నియమించింది.
* చత్తీస్ గఢ్ గవర్నర్ గా రమెన్ డేకాను నియమించింది. ఆ స్థానంలో ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ పదవీ కాలం పూర్తయింది.
* మేఘాలయ గవర్నర్ గా సీహెచ్. విజయశంకర్ నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న పగు చౌహాన్ ను కేంద్ర ప్రభుత్వం తప్పించింది.
* పంజాబ్ గవర్నర్ గా గులాబ్చంద్ కటారియాను నియమించింది మరియు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.
* పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కె.కైలాసనాథన్ నియమితులయ్యారు
For more current affairs please visit: currentaffairs360.in