వార్తల్లోని వ్యక్తులు:
ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా:
ఆంధ్రప్రదేశ్ నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా హరీష్ కుమార్ గుప్తా జనవరి 31న బాధ్యతలు స్వీకరించారు. ఇంతక ముందు డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమల రావు జనవరి 31న పదవీ విరమణ చేశారు.
జమ్మూకశ్మీరు చెందిన హరీష్ కుమార్ గుప్తా న్యాయవిద్యను అభ్యసించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమేంట్ విభాగంలో డీఐజీగా, గుంటూరు రేంజ్ ఐజీగా పని చేశారు. న్యాయ విభాగం ఐజీగానూ సేవలందించారు.
NHRC నూతన చైర్మన్ గా జస్టిస్ వి. రామసుబ్రమణియన్:
జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) చైర్మన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.రామ సుబ్రమణియన్ నియమితులయ్యారు.
NHRC చైర్మన్ గా పనిచేసిన జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్ర 2024 జూన్ 1న పదవీ విరమణ చేయగా, సభ్యురాలు విజయ భారతీ సయానీ ప్రస్తుతం తాత్కాలిక (యాక్టింగ్ )ఛైర్మన్ వ్యవహరిస్తున్నారు.
చైర్మన్ రామసుబ్రమణియన్ తో పాటు సభ్యులుగా ప్రియాంక్ కనూంగో, డాక్టర్ బిద్యుత్ రంజన్ సారంగి (రిటైర్డ్)లను నియమిస్తున్నట్లు NHRC తెలిపింది.
వి. రామసుబ్రమణియన్ స్వస్థలం తమిళనాడులోని మన్నారుడి. 2019 జూన్ 22న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.2019 సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2023 జూన్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు.
భారత జాతీయ మానవ హక్కుల కమిషన్ 1993లో భారత పార్లమెంటు మానవ హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 1993 అక్టోబరు 12న ఏర్పడింది. ఈ కమిషన్ రాజ్యాంగ బద్దంగా, చట్టబద్దంగా ప్రజలకు కల్పించిన హక్కుల రక్షణ బాధ్యతలు చేపడుతుంది
నినాదం : సర్వే భవంతు సుఖినా/అందరు సంతోషంగా ఉండాలి
హెడ్ క్వార్టర్స్ : సర్దార్ పటేల్ భవన్, న్యూఢిల్లీ, భారతదేశం
సెబీ(SEBI) కొత్త చైర్మన్ గా తుహిన్ కాంత పాండే :
సెబీ(SEBI) కొత్త చైర్మన్ గా తుహిన్ కాంత పాండే మార్చి 1, 2025 ముంబైలోని మార్కెట్ నియంత్రణ సంస్థల ప్రధాన కార్యాలయంలో తుహిన్ కాంత పాండే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. శ్రీ పాండే మూడు సంవత్సరాల పాటు మార్కెట్ నియంత్రణ సంస్థకు నాయకత్వం వహిస్తారు.
మాధబి పూరి బుచ్ స్థానం లో
సెబి( SEBI) గురించి :భారతప్రభుత్వంలోనిఆర్థిక మంత్రిత్వశాఖ యొక్క పరిపాలనా పరిధిలోని భారతదేశంలో సెక్యూరిటీలు మరియు వస్తువుల మార్కెట్ కోసం నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ( SEBI ) . ఇది ఏప్రిల్ 12, 1988న కార్యనిర్వాహక సంస్థగా స్థాపించబడింది మరియు SEBI చట్టం , 1992 ద్వారా 30 జనవరి 1992న చట్టబద్ధమైన అధికారాలను పొందింది
RBI బ్యాంకు నూతన గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా బాధ్యతల స్వీకారం:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) 26వ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక వ్యవస్థలపై విశ్వాసాన్ని, వృద్ధిని పెంచేలా స్థిరత్వం కొనసాగేలా ఆర్టీఐ పనిచేస్తుందని కొత్త గవర్నర్ మల్హోత్రా హామీనిచ్చారు. ద్రవ్యోల్బణం సౌకర్యవంతమైన స్థాయి కంటే పైన, జీడీపీ 7 త్రైమాసికాల కనిష్ఠం వద్ద, రూపాయి మారకపు విలువ జీవనకాల కనిష్ఠానికి – చేరిన ప్రస్తుత సమయంలో బాధ్యతలు స్వీకరిం చిన మల్హోత్రా (56) మాట్లాడుతూ ‘ప్రజా ప్రయో జనాల కోసం అత్యుత్తమ విధానాలనే అందిస్తామన్నారు. ఇప్పటిదాకా రెవెన్యూ కార్యద ర్శిగా పనిచేసిన మల్హోత్రాకు ఆర్బీఐ గవర్నరుగా ‘వృద్ధి, ద్రవ్యోల్బణం మధ్య సమతౌల్యత సాధిండమే ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.
RBI ఏర్పాటు :1, ఏప్రిల్ 1935
Head Quarter: Mumbai, Maharastra.
RBI డిప్యూటీ గవర్నర్లు :
1.T.స్వామినాథన్,
- ఎం. రాజేశ్వర్ రావు,
3.టి. రబి శంకర్
4.Dr.M.D.పాషా
మహారాష్ట్ర ముఖ్య మంత్రి గా దేవేంద్ర ఫడణవిస్:
మహారాష్ట్ర ఎన్నికల లో BJP విజయ౦ తర్వాత మహారాష్ట్ర ముఖ్య మంత్రి గా దేవేంద్ర ఫడణవిస్ ప్రమాణ స్వీకారం డిసెంబర్ 5 న చేసారు . ఉప ముఖ్యమంత్రులు గా శివసేన అధినేత ఎకనాద్ షిండే అండ్ NCP అదినేత అజిత్ పవర్ లు ప్రమాణ స్వీకారం చేసారు.
మహారాష్ట్ర గవర్నర్ : C P రాధాకృష్ణన్
బ్రహ్మోస్ డీజీగా జైతీర్థ్ ఆర్ జోషి:
బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ గా డీఆర్డీఎల్ శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్థ ఆర్ జోషి బాధ్యతలు చేపట్టారు. భారత్, రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ని ఏర్పాటుచేశాయి. హైదరాబాద్ లోనూ దాని కార్యాలయం ఉంది. ఇక్కడ శాస్త్ర వేత్తగా కొనసాగిన ఆయన.. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో విశేష కృషి చేశారు. దీర్ఘశ్రేణి ఉపరి తలం నుంచి గగనతల క్షిప ణుల అభివృద్ధి, పరిశోధన లకు ప్రోగ్రాం డైరెక్టరుగా ఆయన నాయకత్వం వహించారు.
ప్రస్తుతం వున్నా అతుల్ దిన కర్ రాణే పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో డాక్టర్ జోషి బాధ్యతలు చేపట్టారు.
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం:
ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం అగ్ర నేత హేమంత్ సోరెన్ (49) 28.11.2024 గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మొరహాబాదీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్య క్రమానికి ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ సీఎంలు మమతా బెనర్జీ, భగవంత్ మాన్, తెలంగాణ, కర్ణాటక ఉపముఖ్యమంత్రులు భట్టివిక్రమార్క, డీకే శివ కుమార్, ఆప్ జాతీయ కన్వీనర్ కేజీవాల్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, హేమంత్ సోరెన్ సతీమణి కల్పన తదిత రులు హాజరయ్యారు. అంతకుముందు హేమంత్ సోరెన్ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. హేమంత్ సీఎంగా ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి.
థాయ్‌లాండ్ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్‌గా నటుడు సోను సూద్:
భారతీయ నటుడు మరియు మానవతావాది సోను సూద్‌ను థాయ్‌లాండ్ దేశం తమ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. థాయ్‌లాండ్ పర్యాటక శాఖ ఈ గుర్తింపును ప్రకటించింది, ఇందువల్ల ఆయనకు “గౌరవనీయ పర్యాటక సలహాదారు” హోదా దక్కింది. ఈ పదవిలో ఆయన థాయ్‌లాండ్ పర్యాటక ప్రాచుర్యాన్ని భారతీయ పర్యాటకులలో విస్తృతం చేసేందుకు సహాయం చేస్తారు. సోను సూద్ తన సామాజిక సేవలతో దేశ ప్రజల అభిమానాన్ని సంపాదించుకుని “ప్రవాస కార్మికుల రక్షకుడు”గా పేరు పొందారు, ముఖ్యంగా మహమ్మారి సమయంలో ఆయన చేసిన సహాయ కార్యక్రమాలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి.
51వ సుప్రిం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా:
జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ సుప్రిం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 11, 2024న ప్రమాణ స్వీకారం చేశారు, జస్టిస్ D.Y. చంద్రచూడ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే నియమించబడిన జస్టిస్ ఖన్నా రాజ్యాంగ, వాణిజ్య మరియు పర్యావరణ చట్టంలో విస్తృతమైన అనుభవాన్ని తెచ్చారు. 2019లో సుప్రీంకోర్టుకు ఎదగడానికి ముందు, అతను 2005 నుండి ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశాడు. ప్రధాన న్యాయమూర్తిగా అతని పదవీకాలం చాలా తక్కువగా ఉంటుంది, మే 2025 వరకు ఆరు నెలల పాటు కొనసాగుతుంది.
సుప్రీంకోర్టు గురించి :
భారత రాజ్యాంగం జనవరి 26, 1950న అమల్లోకి వచ్చిన రెండు రోజుల తర్వాత, జనవరి 28, 1950న భారత సుప్రీంకోర్టు స్థాపించబడింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం, అప్పటి నుండి ఉనికిలో ఉన్న ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా స్థానంలో ఏర్పాటు చేయబడింది. 1937 బ్రిటిష్ పాలనలో, మరియు లండన్‌లోని ప్రివీ కౌన్సిల్ యొక్క జ్యుడీషియల్ కమిటీ, స్వాతంత్ర్యానికి ముందు భారతదేశానికి అత్యున్నత అప్పీల్ కోర్టుగా పనిచేసింది.
ప్రారంభంలో, సుప్రీంకోర్టు 1958లో న్యూఢిల్లీలోని తిలక్ మార్గ్‌లోని ప్రస్తుత భవనానికి మారే వరకు పార్లమెంట్ హౌస్ ఛాంబర్స్ నుండి పనిచేసింది
భారత దేశ రాష్ట్రాల ముఖ్య మంత్రులు – గవర్నర్ లు (27.10.2024 వరకు ) |
|||
క్రమ సంఖ్య | రాష్ట్రం | ముఖ్యమంత్రి | గవర్నర్ |
1 | ఆంధ్రప్రదేశ్ | నారా చంద్ర బాబు నాయుడు | ఎస్.అబ్దుల్ నజీర్ |
2 | తెలంగాణ | ఏ .రేవంత్ రెడ్డి | జిష్ణు దేవ్ వర్మ |
3 | తమిళనాడు | M.K స్టాలిన్ | ఆర్.ఎన్. రవి |
4 | కర్ణాటక | సిద్ద రామయ్య | థావర్ చంద్ గెహ్లాట్ |
5 | మహారాష్ట్ర | ఎకనాద్ షిండే | సి .పి . రాదా కృష్ణన్ |
6 | గోవా | ప్రమోద్ సావంత్ | శ్రీధరన్ పిళ్ళై |
7 | గుజరాత్ | భూపేంద్ర పటేల్ | ఆచార్య దేవ్ వ్రత్ |
8 | హర్యానా | నయాబ్ సింగ్ సైనీ | బండారు దత్తాత్రేయ |
9 | కేరళ | పినరయి విజయన్ | ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ |
10 | రాజస్థాన్ | భజన్ లాల్ శర్మ | హరి భౌ బగాడే |
11 | మధ్యప్రదేశ్ | మోహన్ యాదవ్ | మంగూబాయి సి . పటేల్ |
12 | ఛత్తీస్‌గఢ్ | విష్ణు దేవ్ సాయ్ | రామన్ దేకా |
13 | ఉత్తరప్రదేశ్ | యోగీ ఆదిత్యనాథ్ | ఆనంది బెన్ పటేల్ |
14 | ఉత్తరాఖండ్ | పుష్కర్ సింగ్ ధామీ | గుర్మిత్ సింగ్ |
15 | పంజాబ్ | భగవంత మాన్ | గులాబ్ చంద్ కటారియ |
16 | హిమాచల్ ప్రదేశ్ | సుఖ్వీర్ సింగ్ సుఖు | శివ ప్రతాప్ శుక్ల |
17 | జార్ఖండ్ | హేమంత సోరెన్ | సంతోష్ గంగ్వార్ |
18 | బీహార్ | నితీష్ కుమార్ | రాజేంద్ర ఆర్లేకర్ |
19 | ఒడిషా | మోహన్ చరణ్ మాఝీ | రఘుబర్ దాస్ |
20 | పశ్చిమ బెంగాల్ | మమతా బెనర్జీ | సి.వి.ఆనంద్ బోస్ |
21 | సిక్కిం | ప్రేమ్ సింగ్ తమంగ్ | ఓమ్ ప్రకాష్ మాథుర్ |
22 | అరుణాచల్ ప్రదేశ్ | పేమా ఖండు | కైవల్య త్రివిక్రమ్ పర్నయక్ |
23 | మణిపూర్ | ఎన్. బీరేన్ సింగ్ | లక్ష్మణ్ ఆచార్య (అదనపు బాధ్యత) |
24 | నాగాలాండ్ | నెఫ్యూ రియో | లా. గణేశన్ |
25 | మిజోరం | లాల్ దుహుమా | కుంభం పాటి హరిబాబు |
26 | మేఘాలయ | కన్రాడ్ సంగ్మా | సి. ఎచ్ .విజయ శంకర్ |
27 | త్రిపుర | మాణిక్ సాహ | నల్లు ఇంద్ర సేన రెడ్డి |
28 | అసోం | హిమంత బిస్వ సర్మా | లక్ష్మణ్ ఆచార్య |
భారత దేశ కేంద్ర పాలిత ప్రాంతాలు – ముఖ్య మంత్రులు –లెఫ్ట్ నెంట్ గవర్నర్ లు (27.10.2024 వరకు ) |
|||
1 | డిల్లీ | అతిషి మార్లేనా సింగ్ | వినయ్ కుమార్ సక్సేన |
2 | పుదుచ్చేరి | ఎన్ . రంగస్వామి | కునియల్ కైలాష నాదాన్ |
3 | జమ్మూ కాశ్మీర్ | ఒమర్ అబ్దుల్లా | మానోజ్ సిన్హా |
4 | లదాఖ్ | – | రంజన్ గోకుల్ |
5 | చండీగడ్ | – | గులాబ్ చంద్ కటారియా |
6 | లక్ష్యదీప్ | – | ప్రపుల్ ఖోడా పటేల్ |
7 | అండమాన్ అండ్ నికోబార్ దీవులు | – | దేవేంద్ర కుమార్ జోషి |
8 | దాద్రానగర్ హవేలి, దమన్ డయ్యు | – | ప్రపుల్ ఖోడా పటేల్ (అదనపు బాధ్యతలు ) |
తెలంగాణా వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా M .కోదండ రెడ్డి :
తెలంగాణా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేస్తూ సెప్టెంబర్ 6 న తెలంగాణా గవర్నమెంట్ ఉత్తర్వులు జారి చేసింది . దీనికి చైర్మన్ గా M .కోదండ రెడ్డి ని నియమించింది .
BC కమిషన్ చైర్మెన్ గా -నిరంజన్
విద్య కమిషన్ చైర్మన్ గా -ఆకునూరి మురళి
ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా కేంద్ర మంత్రి – రామ్మోహన్ నాయుడు :
ఆసియా పసిఫిక్ సభ్య దేశాల చైర్మన్ గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎన్నికయ్యారు .
రైల్వే బోర్డు నూతన చైర్మన్ గా సతీష్ కుమార్ :
ప్రస్తుతం వున్నా జయవర్మ సిన్హా ( తొలి మహిళా ) స్తానం లో రైల్వే బోర్డు 47 వ చైర్మన్ గా సతీష్ కుమార్ నియమితులు ఐనారు.
NSG నూతన DG గా శ్రీనివాసన్ :
NSG (నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ) డైరెక్టర్ జనరల్ గా ప్రస్తుతం వున్నా నలిన్ ప్రభాత్ స్తానం లో నూతన NSG DG గా శ్రీనివాసన్ నియమితులు ఐనారు .
యూపిఎస్సి (UPSC) చైర్ పర్సన్ గా ప్రీతీ సూదన్ నియామకం :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్ పర్సన్ గా ప్రీతీ సూదన్ బాధ్యతలు స్వీకరించారు.
ఇంతకు ముందు పదవిలో వున్నవారు – మనోజ్ సోనీ
UPSC ఏర్పాటు –1926
ఐరోపా కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాన్ డేర్ లేయేన్ ఎన్నిక:
- ఐరోపా సమాజ (ఈయూ) కార్యనిర్వాహక కమిషన్ అధ్యక్షురాలిగా ఉర్సులా వాన్ డేర్ లేయేన్ ఎన్నికయ్యారు.
- ఈ యు – రాజధాని – బ్రస్సెల్స్ ,బెల్జియం
- స్థాపన : 16 జనవరి 1958
SBI నూతన చైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారు నియామకం :
SBI నూతన చైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి గారు ఆగష్టు 28 నుండి కొనసాగుతారు .
ప్రస్తుతం: దినేష్ కుమార్ ఖార్ గారు వున్నారు
SBI ప్రస్తానo :1921 న బ్యాంకు అఫ్ కలకత ,బ్యాంకు అఫ్ బాంబే , బ్యాంకు అఫ్ మంద్రాస్ అను ఈ మూడు బ్యాంకు లను కలిపి ఇంపీరియల్ బ్యాంకు గా ఏర్పాటు చేసారు.
1955 న జూలై 1 స్ట్ న ఇంపీరియల్ బ్యాంకు ను SBI గా పేరు మార్పు.
* శ్రీలంక నూతన 9వ అధ్యక్షుడు దిసనాయకే అధ్యక్షుడిగా ప్రమాణం
ఆర్థికంగా కుదేలైన దేశ పునరుజ్జీ వానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని శ్రీలంక నూతన అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే (56) ప్రకటించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జయంత జయ సూరియా సోమవారం మార్క్సిస్ట్ నేత దిసనా చేయించారు. అధ్యక్ష సచివాలయం ఇందుకు వేదికైంది.
ఎయిర్ స్టాఫ్ తదుపరి చీఫ్‌గా ఎయిర్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ 21 సెప్టెంబర్ 2024న నియమితులయ్యారు.
ప్రస్తుతం భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వైస్ చీఫ్‌గా ఉన్నారు.అమర్ ప్రీత్ సింగ్ సెప్టెంబర్ 30న అత్యున్నత పదవిని చేపట్టనున్నారు,ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్. చౌదరి పదవీ విరమణ పొందారు.
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు అతిషి గారు :
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకురాలు అతిషి 21 సెప్టెంబర్ 2024న ప్రమాణ స్వీకారం చేశారు.ఆమె ఐదుగురు మంత్రులతో పాటు రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ VK సక్సేనా చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
పది రాష్ట్రాలకు నూతన గవర్నర్ల నియామకం:
ఇందులో ఏడుగురిని కొత్తగా నియమించగా, ముగ్గురిని ఒకచోట నుంచి మరోచోటకు బదిలీ చేసింది.
* తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు.
* మహారాష్ట్ర గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ ను ఈ స్థానంలో ఉన్న రమేష్ బైస్ ను తప్పించింది.
* రాజస్థాన్ గవర్నర్ గా హరిభావ్ కిషన్ రావ్ బాగ్దేని నియమించింది. ఈ స్థానంలో ఉన్న సీనియర్ నేత కల్రాజ్ మిశ్రాను తప్పించింది.
* సిక్కిం గవర్నర్ గా ఓం ప్రకాశ్ మాధుర్ ని నియమించింది. ఈ స్థానంలో ఉన్న లక్షణ్ ప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్ బదిలీ చేసింది.
* అస్సాం గవర్నర్ గా లక్షణ్ ప్రసాద్ ఆచార్యను నియమించింది .ఇతనికి మణిపూర్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం మణిపుర్ గవర్నర్గా ఉన్న అనసూయ ఉయికేను తప్పించింది.
* జార్ఖండ్ గవర్నర్ గా సంతోష్ కుమార్ గంగ్వార్ ను నియమించింది.
* చత్తీస్ గఢ్ గవర్నర్ గా రమెన్ డేకాను నియమించింది. ఆ స్థానంలో ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ పదవీ కాలం పూర్తయింది.
* మేఘాలయ గవర్నర్ గా సీహెచ్. విజయశంకర్ నియమితులయ్యారు. ఈ స్థానంలో ఉన్న పగు చౌహాన్ ను కేంద్ర ప్రభుత్వం తప్పించింది.
* పంజాబ్ గవర్నర్ గా గులాబ్చంద్ కటారియాను నియమించింది మరియు కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్గా నియమించింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను అదనంగా నిర్వర్తించిన పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు.
* పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కె.కైలాసనాథన్ నియమితులయ్యారు
You may also read about: కేంద్ర మంత్రి మండలి-2024