అవార్డులు:
‘పద్మ’ పురస్కారాలు – 2025
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2025 ఏడాదికి గాను జనవరి 25న పద్మ పురస్కారాలను ప్రకటించింది.
మొత్తం 139
పద్మవిభూషణ్-07
పద్మభూషణ్-19
పద్మశ్రీ -113
పద్మవిభూషణ్ గ్రహీతలు (7)
- దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (వైద్యం) – తెలంగాణా
- జస్టిస్ జగదీశ్ సింగ్(ప్రజా వ్యవహారాలు)- చండీగఢ్
- కుముదిని రజనీకాంత్ (కళలు) – గుజరాత్
- లక్ష్మీనారాయణ సుబ్రమణ్యం (కళలు) – కర్ణాటక
- ఎం.టి.వాసుదేవన్ నాయర్ (సాహిత్యం) – కేరళ (మరణానంతరం)
- ఒసాము సుజుకి (వాణిజ్యం) – జపాన్
- శారద నిన్హా (కళలు) – బీహార్
పద్మభూషణ్ గ్రహీతలు(19)
- నందమూరి బాలకృష్ణ (కళలు) – ఆంధ్రప్రదేశ్
- ఎ. సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – కర్ణాటక
- అనంత్ నాగ్ (కళలు) – కర్ణాటక
- బిబేక్ దెబ్రయ్(మరణానంతరం) (సాహిత్యం, విద్య) – ఎన్ సి టీ ఢిల్లీ
- జతిన్ గోస్వామి (కళలు) – అస్సాం
- జోస్ చాకో పెరియప్పురం (వైద్యం) – కేరళ
- కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఇతర – ఆర్కియాలజీ) – ఎన్సీటీ ఢిల్లీ
- మనోహర్ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – మహారాష్ట్ర
- నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) – తమిళనాడు
- పీఆర్ శ్రీజేశ్ (క్రీడలు) – కేరళ
- పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) – గుజరాత్
- పంకజ్ ఉదాస్ (మరణానంతరం) (కళలు) – మహారాష్ట్ర
- రామ్ బహదుర్ రాయ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – ఉత్తర్ ప్రదేశ్
- సాధ్వీ రితంభరా (సామాజిక సేవ) – ఉత్తర్ ప్రదేశ్
- ఎస్. అజిత్ కుమార్ (కళలు) – తమిళనాడు
- శేఖర్ కపూర్ (కళలు) – మహారాష్ట్ర
- శోభన చంద్రకుమార్ (కళలు) – తమిళనాడు
- సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – బిహార్
- వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – అమెరికా
పద్మశ్రీ -113
- అద్వైత చరణ్ గడనాయక్ (కళలు) – ఒడిశా
- అచ్యుత్ రామచంద్ర పలవ్ (కళలు) – మహారాష్ట్ర
- అజయ్ వి. భట్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – అమెరికా
- అనిల్ కుమార్ బోరో (సాహిత్యం, విద్య) – అస్సాం
- అరిజిత్ సింగ్ (కళలు) – పశ్చిమ బెంగాల్
- అరుంధతి భట్టాచార్య (వాణిజ్యం, పరిశ్రమలు) – మహారాష్ట్ర
- అరుణోదయ్ సాహా (సాహిత్యం, విద్య) – త్రిపుర
- అర్వింద్ శర్మ (సాహిత్యం, విద్య) – కెనడా
- అశోక్ కుమార్ మహాపాత్ర (వైద్యం) – ఒడిశా
- అశోక్ లక్ష్మణ్ షరాఫ్ (కళలు) – మహారాష్ట్ర
- అశుతోష్ శర్మ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – ఉత్తర్ ప్రదేశ్
- అశ్విని భీడే దేశాండే (కళలు) – మహారాష్ట్ర
- బైజ్యనాథ్ మహారాజ్ (ఆధ్యాత్మికం) – రాజస్థాన్
- బ్యారీ గాడ్ జాన్ (కళలు) – ఎన్సీటీ ఢిల్లీ
- బేగమ్ బతోల్ (కళలు) – రాజస్థాన్
- భరత్ గుప్త్ (కళలు) – ఎన్సీటీ ఢిల్లీ
- బేరు సింగ్ చౌహాన్ (కళలు) – మధ్యప్రదేశ్
- భీమ సింగ్ భవేశ్ (సామాజిక సేవ) – బీహార్
- భీమవ్వ దొడ్డబాలప్ప (కళలు) – కర్ణాటక
- బుధేంద్ర కుమార్ జైస్ (వైద్యం) – మధ్యప్రదేశ్
- సి.ఎస్. వైద్యనాథన్ (ప్రజా వ్యవహారాలు) – ఎన్సీటీ దిల్లీ
- చైత్రం దేవచంద్ పవార్ (సామాజిక సేవ) – మహారాష్ట్ర
- చంద్రకాంత్ తేర్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – గుజరాత్
- చంద్రకాంత్ సోంపుర (ఆర్కిటెక్చర్) – గుజరాత్
- చేతన్ ఇ చిట్నిస్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – ఫ్రాన్స్
- డేవిడ్ ఆర్ సి హ్ (సాహిత్యం, విద్య) – మేఘాలయ
- దుర్గాచరణ్ ర ర్ (కళలు) – ఒడిశా .
- ఫరూక్ అహ్మద్ మిర్ (కళలు) – జమ్మూకశ్మీర్
- గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ (సాహిత్యం, విద్య) – ఉత్తర్ ప్రదేశ్
- గీతా ఉపాధ్యాయ్ (సాహిత్యం, విద్య) అస్సాం షైన్ ఇండియా
- గోకుల్ చంద్ర దాస్ (కళలు) – పశ్చిమ బెంగాల్
- గురువాయుర్ దొరై (కళలు) – తమిళనాడు
- హరందన్ సింగ్ భట్టీ (కళలు) – మధ్య ప్రదేశ్
- హరిమన్ శర్మ (వ్యవసాయం) – హిమాచల్ ప్రదేశ్
- హరందర్ సింగ్ శ్రీనగర్వలే (కళలు) – పంజాబ్
- హర్వీందర్ సింగ్ (క్రీడలు) – హర్యానా
- హసన్ రఘు (కళలు) – కర్ణాటక
- హేమంత్ కుమార్ (వైద్యం) – బీహార్
- హృదయ్ నారాయణ్ దీక్షిత్ (సాహిత్యం, విద్య) – ఉత్తర్ ప్రదేశ్
- హ్యూగ్ అండ్ కొల్లీన్ గాంట్జర్ (మరణానంతరం) (జర్నలిజం) – ఉత్తరాఖండ్
- ఇనివళప్పిల్ మణివిజయన్ (క్రీడలు) – కేరళ
- జగదీశ్ జోషిల (సాహిత్యం, విద్య) – మధ్యప్రదేశ్
- జస్పీందర్ నరూలా (కళలు) – మహారాష్ట్ర
- జోనస్ మాసెట్టి (ఆధ్యాత్మికం). – బ్రెజిల్
- మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు) – తెలంగాణ
- కె.ఎల్. కృష్ణ (సాహిత్యం, విద్య) – ఆంధ్రప్రదేశ్
- మాడుగుల నాగఫణిశర్మ (కళలు) – ఆంధ్రప్రదేశ్
- మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు) – ఆంధ్రప్రదేశ్
- జోయ్ నాంచారన్ బతారీ (కళలు) – అస్సాం
- జుమే యోమామ్ గామిన్ (సామాజిక సేవ) – అరుణాచల్ ప్రదేశ్
- కె.దామోదరన్ (పాకశాస్త్రం) – తమిళనాడు
- కె.ఓమనకుట్టి అమ్మ (కళలు) – కేరళ
- కిశోర్ కునాల్ (మరణానంతరం) (ప్రజా సేవలు) – బీహార్
- ఎల్. హాంగ్ థింగ్ (వ్యవసాయం) – నాగాలాండ్
- లక్ష్మీపతి రామసుబ్బఅయ్యర్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – తమిళనాడు
- లలిత్ కుమార్ మంగోత్ర (సాహిత్యం, విద్య) – జమ్మూకశ్మీర్
- లాలా లోబంగ్ (మరణానంతరం) (ఆధ్యాత్మికం) – లద్దా
- లిబియా లోబో సర్దేశాయ్ (సామాజిక సేవ) – గోవా
- ఎం.డి. శ్రీనివాస్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – తమిళనాడు
- మహాబీర్ నాయక్ (కళలు) – జార్ఖండ్
- మమతా శంకర్ (కళలు) పశ్చిమ బెంగాల్
- మారుతి భుజంగరావు చితంపల్లి (సాహిత్యం, విద్య) – మహారాష్ట్ర
- నాగేంద్ర నాథ్ రాయ్ (సాహిత్యం, విద్య) – పశ్చిమ బెంగాల్
- నారాయణ్ (భులయ్ భాయ్) (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) ఉత్తర్ ప్రదేశ్
- నరేన్ గురుంగ్ (కళలు) – సిక్కిం
- నీరా భాట్ల (వైద్యం) – ఎన్సీటీ ఢిల్లీ
- నిర్మలా దేవీ (కళలు) – బీహార్
- నితిన్ నొప్రియా (సాహిత్యం, విద్య) – అమెరికా
- ఓంకార్ సింగ్ పహ్వా (వాణిజ్యం, పరిశ్రమలు) – పంజాబ్
- పి. దచనమూర్తి (కళలు) – పుదుచ్చేరి
- పాండీ రామ్ మందవీ (కళలు) – ఛత్తీస్ గఢ్
- పార్మర్ లాల్టీభాయ్ నాగీభాయ్ (కళలు) – గుజరాత్
- పవన్ గొయెంక (వాణిజ్యం, పరిశ్రమలు) – పశ్చిమ బెంగాల్
- ప్రశాంత్ ప్రకాశ్ (వాణిజ్యం, పరిశ్రమలు) – కర్ణాటక
- ప్రతిభ సత్పతి (సాహిత్యం, విద్య) – ఒడిశా
- పురిసాయి కన్నప్ప సంబంధన్ (కళలు) – తమిళనాడు
- ఆర్. అశ్విన్ (క్రీడలు) – తమిళనాడు
- ఆర్.జి. చంద్రమోగన్ (వాణిజ్యం, పరిశ్రమలు) – తమిళనాడు
- రాధా బహిన్ భట్ (సామాజిక సేవ) – ఉత్తరాఖండ్
- రాధాకృష్ణ దేవసేనాపతి (కళలు) – తమిళనాడు
- రామ్ ర్క్ మిశ్రా (సాహిత్యం, విద్య) – ఎన్సీటీ ఢిల్లీ
- రణేంద్ర భాను మజుందార్ (కళలు) – మహారాష్ట్ర
- రతన్ కుమార్ పరిమో (కళలు) – గుజరాత్
- రెబాకాంత మహంత (కళలు) – అస్సాం
- రెంథేలి లాల్ (సాహిత్యం, విద్య) – మిజోరం
- రికీ జ్ఞాన్ కేజ్ (కళలు) – కర్ణాటక
- సజ్జన్ భజ (వాణిజ్యం, పరిశ్రమలు) పశ్చిమ బెంగాల్
- సాలీ హెూల్కర్ (వాణిజ్యం, పరిశ్రమలు) – మధ్యప్రదేశ్
- సంత్ రామ్ దేశ్వాల్ (సాహిత్యం, విద్య) – హరియాణా
- సత్యపాల్ సింగ్ (క్రీడలు) – ఉత్తర్ ప్రదేశ్
- సీని విశ్వనాథన్ (సాహిత్యం, విద్య) – తమిళనాడు –
- నేతురామన్ పంచనాథన్ (సైన్స్ అండ్ టెక్నాలజీ) – అమెరికా
- షె కా షైకా అలీ అల్-జాబేర్ అల్- సభా (సాహిత్యం, విద్య) కువైట్
- షీన్ కాఫ్ నిజామ్ (శివ్ కిషన్ బిస్సా) (సాహిత్యం, విద్య) – రాజస్థాన్.
- శ్యామ్ బిహారి అగర్వాల్ (కళలు) – ఉత్తర్ ప్రదేశ్
- సోనియా నిత్యానంద్ (వైద్యం) – ఉత్తరప్రదేశ్
- స్టీఫెన్ నాప్ (సాహిత్యం, విద్య) – అమెరికా
- సుభాష్ ఖేతులాల్ శర్మ (వ్యవసాయం) – మహారాష్ట్ర
- సురేశ్ హరిలాల్ సోనీ (సామాజిక సేవ) – గుజరాత్
- సురీందర్ కుమార్ వసాల్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) – ఢిల్లీ
101.స్వామీ ప్రదీప్తానంద (కార్తిక్ మహారాజ్) (ఆధ్యాత్మికం) – పశ్చిమ బెంగాల్
- సయ్యద్ ఐనుల్ హసన్ (సొహత్యం, విద్య) – ఉత్తర్ ప్రదేశ్
- తేజేంద్ర నారాయణ్ మజుందార్ (కళలు) – పశ్చిమ బెంగాల్
- తీయం సూర్యముఖి దేవి (కళలు) – మణిపుర్
- తుషార్ దుర్గేశాయ్ శుక్లా (సాహిత్యం, విద్య) – గుజరాత్
- వి.రాఘవేంద్రాచార్య పంచముఖి సాహిత్యం, విద్య) – ఆంధ్రప్రదేశ్
107.వాసుదేవ్ కామత్ (కళలు) – మహారాష్ట్ర
108.వేళు ఆసాన్ (కళలు) – తమిళనాడు
- వెంకప్ప అంబాజీ సుగటేకర్ (కళలు) – కర్ణాటక
- విజయ్ నిత్యానంద్ సరీశ్వర్ జీ మహారాజ్ (ఆధ్యాత్మికం) – బీహార్
- విజయలక్ష్మి దేశమానే (వైద్యం) – కర్ణాటక
- విలాస్ డాంగ్రే (వైద్యం) – మహారాష్ట్ర
- వినాయక్ లోహానీ (సామాజిక సేవ) – పశ్చిమ బెంగాల్
నోబెల్ పురస్కారాలు – 2024:
2024వ సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలను ఆరు రంగాల్లో (వైద్యం, భౌతిక, రసాయన, సాహిత్యం, శాంతి, ఆర్థిక) ప్రకటించారు. అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్ క్రోనర్ (10 లక్షల డాలర్లు) నగదు అందుతుంది. ఈ బహుమతుల ప్రదానోత్సవం అవార్డుల సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా ఏటా డిసెంబర్ 10న నిర్వహిస్తారు. నోబెల్ శాంతి బహుమతిని నార్వే రాజధాని ఓస్లోలో అందిస్తారు. మిగిలిన ఐదు బహుమతులను స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ ఇస్తారు. ఈ సందర్భంగా ‘విజేతలకు నగదు పురస్కారం, గోల్డ్ మెడల్, డిప్లొమాను అందజేస్తారు.
రంగం | విజేతలు | పరిశోధన |
వైద్యరంగం | విక్టర్ ఆంబ్రోస్(అమెరికా)
గ్యారీ రవుకున్(అమెరికా) |
జన్యుపదార్థంలోని మైక్రో ఆర్ఎన్ఏను కనుగొన్నందుకుగాను |
భౌతిక శాస్త్రం | జాన్ జె.హాప్ఫీల్డ్(అమెరికా)
జెఫ్రీ ఈ. హింటన్(కెనడా) |
మెషీన్ లెర్నింగ్ విత్ ఆర్టిఫీషియల్ న్యూరల్ నెట్వర్క్ ఆవిష్కరణ కోసం వీరిరువురూ చేసిన కృషికిగాను |
రసాయన శాస్త్రం | డేవిడ్ బేకర్(అమెరికా)
డెమిస్ హసా-బిస్(యునైటెడ్ కింగ్డమ్) జాన్ జంపర్(యునైటెడ్ కింగ్డమ్) |
జీవానికి నిర్మాణ అణువులైన ప్రొటీన్లపై విశేష పరిశోధనలు చేసినందుకుగాను |
సాహిత్యం | హాన్ కాంగ్(దక్షిణ కొరియా) | మానవ జీవితపు దుర్బలత్వాన్ని, చారిత్రక విషాదాలను తన గద్య కవిత్వంతో కళ్లకు కట్టించిన కృషికి గాను |
శాంతి | నిహాన్ హిడాంక్యో’ సంస్థకు(జపాన్) | అణ్వాయుధాలకు తావులేని శాంతియుత ప్రపంచమే లక్ష్యంగా అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తున్నందుకుగాను |
ఆర్ధిక రంగం | డారెన్ అసెమోగ్లు(అమెరికా)
సైమన్ జాన్సన్ (అమెరికా) జేమ్స్ రాబిన్సన్(అమెరికా) |
దేశాల మధ్య ఆర్థిక అసమానతలకు కారణాలపై పరిశోధన చేసినందుకుగాను |
నోబెల్ ప్రైజ్ గురించి :
నోబెల్ బహుమతి స్థాపన 1895లో స్వీడిష్ శాస్త్రవేత్త, ఆవిష్కర్త, మరియు డైనమైట్ యొక్క ఆవిష్కర్త అయిన ఆల్ఫ్రెడ్ నోబెల్ (Alfred Nobel) చేత జరిగింది.
ఈ బహుమతులు మొదటిసారిగా 1901లో అందజేయబడినాయి. ప్రస్తుతమవుతున్న విభాగాలు:
- భౌతిక శాస్త్రం (Physics)
- రసాయన శాస్త్రం (Chemistry)
- వైద్య శాస్త్రం (Physiology or Medicine)
- సాహిత్యం (Literature)
- శాంతి (Peace)
- ఆర్థిక శాస్త్రం (Economics, 1968లో చేర్చబడింది)
భారతీయులు అందుకున్న నోబెల్ బహుమతులు
భారతీయులకు నోబెల్ బహుమతి ఆరంభం నుంచి గొప్ప గౌరవాన్ని తెచ్చింది. భారతీయులు వివిధ విభాగాలలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు:
- రవీంద్రనాథ్ ఠాగూర్ (1913) – సాహిత్యం: గీతాంజలి కవితా సంపుటికి గాను ఆయన సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందారు.
- సివి రామన్ (1930) – భౌతిక శాస్త్రం: తన ‘రామన్ ఎఫెక్ట్’ అనే కనుగొన్న ప్రక్రియకి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.
- మదర్ తెరిసా (1979) – శాంతి: నిరుపేదలకు, బాధితులకు సహాయం చేసినందుకు గాను ఆమె శాంతి విభాగంలో నోబెల్ బహుమతి పొందారు.
- అమర్త్య సేన్ (1998) – ఆర్థిక శాస్త్రం: ఆర్థిక అభివృద్ధి మరియు సామాజిక సంక్షేమంపై తన పరిశోధనలకు గాను నోబెల్ బహుమతి అందుకున్నారు.
- వెంకట్రామన్ రామకృష్ణన్ (2009) – రసాయన శాస్త్రం: రైబోసోమ్ యొక్క నిర్మాణంపై చేసిన అధ్యయనం కోసం రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు.
- కైలాస్ సత్యార్థి (2014) – శాంతి: బాల కార్మిక వ్యతిరేక ఉద్యమంలో చేసిన సేవలకు గాను ఈ బహుమతి అందుకున్నారు.
- అభిజిత్ బెనర్జీ (2019) – ఆర్థిక శాస్త్రం: ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరిచేందుకు తన పరిశోధనకు గాను ఈ బహుమతి అందుకున్నారు
2023 కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారo: బారెన్ బోయిమ్, అలీ అబు అవ్వాద్:
2023 కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారo ను నవంబర్ 19,2024 న ప్రకటించారు . ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు శాంతి యుత మార్గాన్ని కనుగొనడంతో పాటు ప్రజల మధ్య స్నేహాన్ని పెంపొందించడానికి జీవితాలను అంకితం చేసిన డానియెల్ బారెన్ బోయిమ్, అలీ అబు అవ్వాద కు ప్రదానం చేశారు.
ఇందిరాగాంధీ శాంతి పురస్కారo గురించి :
ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, సామాజికాభివృద్ధి అవార్డుని ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ 1986 నుంచి అందజేస్తుంది. అవార్డు గ్రహీతకు ప్రశంసా పత్రంతో పాటు రూ.25 లక్షల నగదు అందిస్తారు.
55 వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా 2024: గోవా లో :
55 వ (IIF ) ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా 2024 – గోవా లోని శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం లో నవంబర్ 28 న జరిగింది .
55 వ (IIF ) ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అఫ్ ఇండియా 2024 థీమ్ : “ది ఫ్యూచర్ ఇస్ నౌ “
Miss Earth 2024 గా జెస్సికా లేన్:
Miss Earth 2024 కిరీటాన్ని ఆస్ట్రేలియాకు చెందిన జెస్సికా లేన్ గెలుచుకున్నారు. నవంబర్ 9, 2024న ఫిలిప్పీన్స్లోని ఓకాడ మనీలాలో జరిగిన ఫైనల్ కార్యక్రమంలో ఆమెకు కిరీటాన్ని అందజేశారు. గత సంవత్సరం 2023 మిస్ ఎర్త్గా ఉన్న అల్బేనియా నుండి డ్రిటా జిరి ఆమెను వరుసలో ఉంచుతూ కిరీటం అందించారు. 76 మంది పోటీదారులు ఈ ఏడాది ఈ టైట్ కోసం పోటీ పడ్డారు.
జెస్సికా లేన్ ఒక పర్యావరణవేత్త, ఆస్ట్రేలియాలో పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఆమె గెలిచిన అనంతరం పర్యావరణ పరిరక్షణ, వనరుల వినియోగం మరియు సుదీర్ఘతపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపింది.