Persons in News

Persons in News 2024

వార్తల్లోని వ్యక్తులు 2024:

RBI బ్యాంకు నూతన గవర్నర్ గా  సంజయ్ మల్హోత్రా బాధ్యతల స్వీకారం:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) 26వ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక వ్యవస్థలపై విశ్వాసాన్ని, వృద్ధిని పెంచేలా స్థిరత్వం కొనసాగేలా ఆర్టీఐ పనిచేస్తుందని కొత్త గవర్నర్ మల్హోత్రా హామీనిచ్చారు. ద్రవ్యోల్బణం సౌకర్యవంతమైన స్థాయి కంటే పైన, జీడీపీ 7 త్రైమాసికాల కనిష్ఠం వద్ద, రూపాయి మారకపు విలువ జీవనకాల కనిష్ఠానికి – చేరిన ప్రస్తుత సమయంలో బాధ్యతలు స్వీకరిం చిన మల్హోత్రా (56) మాట్లాడుతూ ‘ప్రజా ప్రయో జనాల కోసం అత్యుత్తమ విధానాలనే అందిస్తామన్నారు. ఇప్పటిదాకా రెవెన్యూ కార్యద ర్శిగా పనిచేసిన మల్హోత్రాకు ఆర్బీఐ గవర్నరుగా ‘వృద్ధి, ద్రవ్యోల్బణం మధ్య సమతౌల్యత సాధిండమే ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.

RBI  ఏర్పాటు :1, ఏప్రిల్  1935

Head Quarter: Mumbai, Maharastra.

RBI డిప్యూటీ గవర్నర్లు :

1.T.స్వామినాథన్,

  1. ఎం. రాజేశ్వర్ రావు,

3.టి. రబి శంకర్

4.Dr.M.D.పాషా


మహారాష్ట్ర ముఖ్య మంత్రి గా దేవేంద్ర ఫడణవిస్:

మహారాష్ట్ర ఎన్నికల లో BJP విజయ౦ తర్వాత మహారాష్ట్ర  ముఖ్య మంత్రి గా దేవేంద్ర ఫడణవిస్ ప్రమాణ స్వీకారం డిసెంబర్ 5 న  చేసారు . ఉప ముఖ్యమంత్రులు గా శివసేన అధినేత ఎకనాద్ షిండే  అండ్ NCP అదినేత అజిత్ పవర్ లు ప్రమాణ స్వీకారం చేసారు.

మహారాష్ట్ర గవర్నర్ : C P రాధాకృష్ణన్


బ్రహ్మోస్ డీజీగా జైతీర్థ్ ఆర్ జోషి:

బ్రహ్మోస్ డైరెక్టర్ జనరల్ గా డీఆర్డీఎల్ శాస్త్రవేత్త డాక్టర్ జైతీర్థ ఆర్ జోషి బాధ్యతలు చేపట్టారు. భారత్, రష్యా సంయుక్తంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ని ఏర్పాటుచేశాయి. హైదరాబాద్ లోనూ దాని కార్యాలయం ఉంది. ఇక్కడ శాస్త్ర వేత్తగా కొనసాగిన ఆయన.. వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధిలో విశేష కృషి చేశారు. దీర్ఘశ్రేణి ఉపరి తలం నుంచి గగనతల క్షిప ణుల అభివృద్ధి, పరిశోధన లకు ప్రోగ్రాం డైరెక్టరుగా ఆయన నాయకత్వం వహించారు.

ప్రస్తుతం వున్నా అతుల్ దిన కర్ రాణే పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో డాక్టర్ జోషి బాధ్యతలు చేపట్టారు.


ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం:

ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా జేఎంఎం అగ్ర నేత హేమంత్ సోరెన్ (49) 28.11.2024 గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. మొరహాబాదీ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్య క్రమానికి ఇండియా కూటమికి చెందిన కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్ సీఎంలు మమతా బెనర్జీ, భగవంత్ మాన్, తెలంగాణ, కర్ణాటక ఉపముఖ్యమంత్రులు భట్టివిక్రమార్క, డీకే శివ కుమార్, ఆప్ జాతీయ కన్వీనర్ కేజీవాల్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, హేమంత్ సోరెన్ సతీమణి కల్పన తదిత రులు హాజరయ్యారు. అంతకుముందు హేమంత్ సోరెన్ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. హేమంత్ సీఎంగా ప్రమాణం చేయడం ఇది నాలుగోసారి.


థాయ్‌లాండ్ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్‌గా  నటుడు సోను సూద్‌:

భారతీయ నటుడు మరియు మానవతావాది సోను సూద్‌ను థాయ్‌లాండ్ దేశం తమ పర్యాటక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. థాయ్‌లాండ్ పర్యాటక శాఖ ఈ గుర్తింపును ప్రకటించింది, ఇందువల్ల ఆయనకు “గౌరవనీయ పర్యాటక సలహాదారు” హోదా దక్కింది. ఈ పదవిలో ఆయన థాయ్‌లాండ్ పర్యాటక ప్రాచుర్యాన్ని భారతీయ పర్యాటకులలో విస్తృతం చేసేందుకు సహాయం చేస్తారు. సోను సూద్ తన సామాజిక సేవలతో దేశ ప్రజల అభిమానాన్ని సంపాదించుకుని “ప్రవాస కార్మికుల రక్షకుడు”గా పేరు పొందారు, ముఖ్యంగా మహమ్మారి సమయంలో ఆయన చేసిన సహాయ కార్యక్రమాలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి.


51వ సుప్రిం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా:

జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ సుప్రిం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 11, 2024న ప్రమాణ స్వీకారం చేశారు, జస్టిస్ D.Y. చంద్రచూడ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముచే నియమించబడిన జస్టిస్ ఖన్నా రాజ్యాంగ, వాణిజ్య మరియు పర్యావరణ చట్టంలో విస్తృతమైన అనుభవాన్ని తెచ్చారు. 2019లో సుప్రీంకోర్టుకు ఎదగడానికి ముందు, అతను 2005 నుండి ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశాడు. ప్రధాన న్యాయమూర్తిగా అతని పదవీకాలం చాలా తక్కువగా ఉంటుంది, మే 2025 వరకు ఆరు నెలల పాటు కొనసాగుతుంది.

సుప్రీంకోర్టు గురించి :

భారత రాజ్యాంగం జనవరి 26, 1950న అమల్లోకి వచ్చిన రెండు రోజుల తర్వాత, జనవరి 28, 1950న భారత సుప్రీంకోర్టు స్థాపించబడింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 ప్రకారం, అప్పటి నుండి ఉనికిలో ఉన్న ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా స్థానంలో ఏర్పాటు చేయబడింది. 1937 బ్రిటిష్ పాలనలో, మరియు లండన్‌లోని ప్రివీ కౌన్సిల్ యొక్క జ్యుడీషియల్ కమిటీ, స్వాతంత్ర్యానికి ముందు భారతదేశానికి అత్యున్నత అప్పీల్ కోర్టుగా పనిచేసింది.

ప్రారంభంలో, సుప్రీంకోర్టు 1958లో న్యూఢిల్లీలోని తిలక్ మార్గ్‌లోని ప్రస్తుత భవనానికి మారే వరకు పార్లమెంట్ హౌస్ ఛాంబర్స్ నుండి పనిచేసింది

For more current Affairs please visit the below link:

అంతర్జాతీయ అంశాలు https://currentaffairs360.in/international-affairs/
అవార్డులు https://currentaffairs360.in/awards/
క్రీడాంశాలు https://currentaffairs360.in/games/
జాతీయా అంశాలు https://currentaffairs360.in/national-affairs/
డైలీ కరెంట్ అఫైర్స్ బిట్స్ -2024 https://currentaffairs360.in/daily-current-affairs-bits/
రాష్ట్రాల సమాచారం https://currentaffairs360.in/states-affairs/
రోజులు – వాటి థీమ్స్ https://currentaffairs360.in/days-and-themes/
వార్తల్లోని వ్యక్తులు https://currentaffairs360.in/persons-in-news/
వ్యక్తులు – పర్యటనలు https://currentaffairs360.in/persons-and-visits/
సదస్సులు- సమావేశాలు https://currentaffairs360.in/summits-and-conferences/
సూచీలు – ఇండియా ర్యాంకు https://currentaffairs360.in/indexes-and-india-ranks/
సైన్స్ & టెక్నాలజీ https://currentaffairs360.in/science-and-technology-affairs/