సైన్స్ & టెక్నాలజీ:
జాబిల్లిపై అడుగుపెట్టిన Firefly ఏరోస్పేస్ సంస్థకు చెందిన ‘బ్లూ ఘోస్ట్’
(Blue Ghost ) వ్యోమనౌక:
తొలి ప్రైవేటు ల్యాండర్ గా రికార్డు :
అమెరికాకు చెందిన ఒక ప్రైవేటు ల్యాండర్ చందమామపై విజయవం తంగా కాలుమోపింది. Firefly ఏరోస్పేస్ సంస్థకు చెందిన ‘బ్లూ ఘోస్ట్‘ (Blue Ghost ) వ్యోమనౌక ఈ ఘనత సాధించింది. చందమామపై కూలిపోకుండా, పక్కకి పడిపోకుండా సరైన స్థితిలో వ్యౌమనౌకను దించిన తొలి ప్రైవేటు సంస్థగా చరిత్ర సృష్టించింది. జాబిల్లి పైకి మానవసహిత యాత్రల పునఃప్రారంభానికి ముందు అక్కడ వ్యాపారావకాశాలను అందిపుచ్చుకునే లక్ష్యంతో మరిన్ని ప్రైవేటు ల్యాండర్లు అక్కడ దిగనున్నాయి. చందమామ కక్ష్య నుంచి ఆటోపైలట్ సాయంతో బ్లూ ఘోస్ట్. జాబిల్లి ఈశాన్య భాగం లోని ఒక పురాతన అగ్నిపర్వత ప్రాంతంలో కాలుమోపింది. ల్యాండింగ్ విజయవంతంగా జరిగి నట్లు Firefly ఏరోస్పేస్ సంస్థకు చెందిన మిషన్ కంట్రోల్ కేంద్రం ద్రువీకరించింది. పెద్ద శిలలు వంటి అవ రోధాలను తప్పించుకుంటూ సురక్షితమైన ప్రదేశంలో అది దిగిందని పేర్కొంది.
అత్యంత అధునాతన AI చాట్‌బాట్ అయిన గ్రోక్ 3:
ఎలోన్ మస్క్ యొక్క xAI అత్యంత అధునాతన AI చాట్‌బాట్ అయిన గ్రోక్ 3ని ప్రారంభించింది, ఇది ఇప్పటివరకు అభివృద్ధి చేయబడిన అత్యంత తెలివైన AIగా ప్రశంసించబడింది.ఈ ప్రయోగం దాదాపు 100,000 మంది వీక్షకులను ఆకర్షించింది మరియు గ్రోక్ 3 యొక్క అసాధారణ సామర్థ్యాలను హైలైట్ చేసింది.అభివృద్ధికి భారీ కంప్యూటింగ్ శక్తి అవసరం,100,000 GPUలు కేవలం 122 రోజుల్లో ఏర్పాటు చేయబడ్డాయి మరియు H100 క్లస్టర్92 రోజుల్లో రెట్టింపు అయ్యాయి.
ఈ అపారమైన మౌలిక సదుపాయాలు గ్రోక్ 3 యొక్క వేగం, ఖచ్చితత్వం మరియు తార్కిక సామర్థ్యాలను గణనీయంగా పెంచాయి, దీనిని అత్యంత అధునాతన AI వ్యవస్థలలో ఒకటిగా నిలిపాయి.
డిసెంబర్ 5 న పీఎస్ఎల్వీ-సి59 ప్రయోగం (నింగిలోకి ప్రోబా-3 ఉపగ్రహం):
ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన ప్రోబా-3 తో పాటు రెండు ఉపగ్రహాలు అవి 1.ఆకల్టార్స్పేస్ క్రాఫ్ట్ (OSC) 2.కరోన గ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్ (CSC). భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) డిసెంబర్ 5 న ప్రయోగించింది . శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్ఎల్వి -సి59 రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరింగింది . వీటి బరువు 550 కిలోలు.సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేయడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.ఇందుకోసం అవి పరస్పరం సమన్వయంతో ఒక క్రమపద్ధతిలో భూకక్ష్యలో విహరిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిది.
జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ నుండి కె4 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం :
వ్యూహాత్మక రక్షణ సామర్ధ్యానికి మరింత పదును పెడుతూ భారత్ కీలక ఆస్త్రాన్ని పరీక్షించింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న కె4 బాలిస్టిక్ క్షిపణిని అణుశక్తితో నడిచే ఐఎన్ఎస్ అరిఘాత్ అనే జలాంతర్గామి నుంచి దిగ్విజయంగా 28.11.2024 న ప్రయోగించిoది. విశాఖపట్నానికి చేరువలో బంగాళాఖాతం నుంచి ఈ పరీక్ష జరిగింది .దీంతో నేల, నింగితోపాటు సముద్రంలో జలాంతర్గామి నుంచీ క్షిపణులను ప్రయోగించ గల సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల సర సన భారత్ చేరింది. జలాంతర్గామి నుంచి ప్రయోగించగల బాలిస్టిక్ క్షిపణి (ఎస్ఎల్బీఎం) తరగతికి చెందిన అస్త్రం K4. ఇది ఘన ఇంధనంతో నడుస్తుంది. దీన్ని గత కొన్నేళ్లలో ఐదు సార్లు భారత్ పరీక్షించింది. అయితే ఆ పరీక్షలన్నీ సముద్రంలోపల ఏర్పాటు చేసిన ఒక వేదికపై నుంచి జరిగాయి. జలాంత ర్గామి నుంచి దీన్ని ప్రయోగించడం ఇదే మొదటిసారి. తాజా పరీక్షలో ఈ అస్త్రం పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించిందని అధికార వర్గాలు తెలిపాయి. చైనాను దృష్టిలో ఉంచుకొని 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా దీన్ని రూపొందించారు.
ఐఎన్ఎస్ ఆరిఘాత్ జలాంతర్గామి 2024 ఆగస్టు 20న నౌకాదళంలో చేరింది. అరిహంత్ శ్రేణి కింద రూపొందిస్తున్న సబ్మెరైన్లలో ఇది రెండోది. విశాఖపట్నం షిప్ బిల్డింగ్ సెంటర్లో దీన్ని నిర్మించారు. ఇదే శ్రేణిలో మూడో అణు జలాంతర్గామి ‘ఐఎన్ఎస్ అరిధామన్’ నిర్మాణ పనులూ జరుగుతున్నాయి. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాల తర్వాత బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగల అణు జలాంతర్గాములు కలిగిన దేశాల్లో భారత్ ఆరోది సబ్ మెరైన్ నుంచి ప్రయోగించగల కె-15 క్షిపణినీ మన దేశం అభివృద్ధి చేసింది. ఇది 750 కిలోమీటర్ల దూరం వెళ్లగలదు.